యువ జనాభానే దేశ ప్రగతికి మూలస్తంభం
1 min read
అని అందుకు “సంతానోత్పత్తి రేటును కాపాడుకోవాలి” – “దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం”: డా. కె. చిట్టి నరసమ్మ”..
కర్నూలు, న్యూస్ నేడు: ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11)ను పురస్కరించుకుని కర్నూలు మెడికల్ కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు న్యూ లెక్చరర్ గ్యాలరీలో తృతీయ సంవత్సరం పార్ట్–1 ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం “దేశాభివృద్ధిలో యువ జనాభా – సంతానోత్పత్తి రేటు పాత్ర” అనే అంశంపై డిబేట్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ డీఎంఈ & కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. చిట్టి నరసమ్మ మాట్లాడుతూ, “భారతదేశం యువ జనాభా అధికంగా ఉన్న దేశం. యువత తమ శక్తి, ప్రతిభ, విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన యువతే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది” అని అన్నారు. అదేవిధంగా దేశ యువతను కాపాడుకోవాలని సంతానోత్పత్తి రేటు పడిపోతే దేశాభివృద్ధి కూడా కుంటుపడుతుందని అన్నారు.విద్యార్థుల మధ్య జరిగిన చర్చలో యువ జనాభా దేశ ఆర్థిక, సామాజిక, వైద్య, సాంకేతిక రంగాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. దేశాభివృద్ధికి యువ జనాభా కీలకమని అందుకే నిర్దిష్ట వయసులో వివాహం, సంతానోత్పత్తి రేటు కాపాడుకోవడం, యువత నైపుణ్యాలు పెంచడం వంటి వll సమకాలీన అంశాలపై వైద్య విద్యార్థులు విశ్లేషణాత్మకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషంగా నిలిచింది.వైస్ ప్రిన్సిపాల్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. సింధియా శుభప్రద మాట్లాడుతూ యువతకు ఈ దేశ అభివృద్ధి యువత పాత్ర, నిర్దేశిత వయస్సు లో వివాహము, సంతాన ఉత్పత్తి వాటి పర్యవసానాలు సామాజిక బాధ్యత, ఆరోగ్య అవగాహన, నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ డా. పుష్పలత, సీనియర్ రెసిడెంట్ డా. బ్రయాన్ లు నిర్వహించారు. విద్యార్థులు ప్రపంచ జనాభా దినోత్సవం సందేశాన్ని ప్రతిబింబించే ఆకర్షణీయమైన పోస్టర్లను ప్రదర్శించారు.అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించి, ఆరోగ్యకరమైన కుటుంబాలు, సమతుల్య జనాభా, యువత సాధికారత, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై యువత లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్లు డా.అరుణ , డా.రేణుక, అసిస్టెంట్ ఆఫీసర్లు డాక్టర్ రవి నాయక్ వెంకటేశ్వర్లు, నాగరాజు,డా. వైష్ణవి,డా. ప్రసన్న రాణి, లెక్చరర్లు సురేష్, భవాని ప్రసాద్, సరిత, రాజశేఖర్ ఎస్సార్లు పిజీలు పాల్గొన్నారు.

