NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్’పకడ్బందీగా నిర్వహించాలి:ఎంపీడీవో 

1 min read

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా శుక్రవారం నాగలూటి,కడుమూరులో జరుగుతున్న ‘సర్’ కార్యక్రమాన్ని ఎంపీడీవో  దశరధ రామయ్య తనిఖీ చేశారు.సర్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలనిఇక నాలుగు రోజులే సర్ ప్రక్రియ..ఈనెల 14 వ తేదీ లోపు ఓటర్ల వెరిఫికేషన్ పక్రియను పూర్తి పూర్తిచేయాలని బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారిని క్షేత్రస్థాయిలో వారితో మాట్లాడి వారి పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని ఓటర్ల నుండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓట్లను తీసివేయకుండా చూస్తూ వారితో మాట్లాడాలని బిఎల్ఓ లకు సూచించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శాన్వాజ్,ఎంఎస్ జిఓ సురేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు శివ కళ్యాణ్ సింగ్,వెంకటేష్, వీఆర్వోలు రామయ్య, సుందరాజు మరియు బిఎల్వోలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *