NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీఈఓ లకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంపీఈఓ ల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం కర్నూల్ స్థానిక ఏపీ ఎన్జీవో భవన్లో నిర్వహించడం జరిగింది.   ఈ సమావేశము ఎంపీఈఓ ల  రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు  అధ్యక్షతన నిర్వహించడం జరిగినది..        ఎంపీఈఓ లుకు గత 12  సంవత్సరాల నుంచి  12000 రూపాయలు చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు కొనసాగుతున్నాము  ప్రస్తుతం మార్చి నుండి ఇప్పటిదాకా నాలుగు నెలల జీతాలు  రాకపోవడం వల్ల మా కుటుంబాలు జీవనాధారం కష్టంగా ఉంది ఉద్యోగ భద్రత లేదు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇన్సూరెన్స్ వంటివి కూడా వర్తించవు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న, వాటిని పాటించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వాము స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో శాంతియుత నిరసనకు వెనకాడము అని రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజ్ ప్రకటించడం జరిగింది  ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి కాశన్నమాట్లాడుతూ ఎంపీఈఓలకుభవిష్యత్తులో జీతాల ఆలస్యం సమస్యలు లేకుండా, మరియు  రాష్ట్ర సంఘ అధ్యక్షులైన కామ్రేడ్ అలపర్తి విద్యసాగర్కి ఈ యొక్క సమస్యను తెలియజేసి వీలైనంత తొందరగా కంటిన్యూయేషన్ జీవో వచ్చి జీతం పెంచే విధంగా చేస్తామని ఈ సమావేశాలలో తెలియజేయడం జరిగింది.అంతేగాకుండా రాష్ట్రంలో ఇటీవల 11,000 మందికి ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు మార్పించిన ఘనత, మరియు దాదాపు 40,000 మంది గురుకులాలు మరియు ఇతర శాఖల ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలకు సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు ఇప్పించిన ఘనత విద్యాసాగర్ కి ఉన్నది..అందుచేత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1300 వందల మంది(కాంట్రాక్టు) ఎంపీఈఓ లకు మినిమం టైం స్కేలు ఇచ్చే విధంగా రాష్ట్ర సంఘం అధ్యక్షులతో చర్చిస్తామని, ఈ విషయంలో కచ్చితంగా మీకు న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పక్షాన హామీ ఇవ్వడం జరిగినది.ఈనాటి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు అధ్యక్షత వహించి కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి నికి ఏపీఎన్జీవో  ఎమ్మిగనూరు తాలూకా ట్రెజరర్ తిరుమల రెడ్డి , కర్నూలు నగర EC member శ్రీరాములుమరియు ఎంపీఈవోస్  రాష్ట్ర అసోసియేషన్ గౌరవాధ్యక్షులు నాగరాజు, ఎంపీఈఓ ల కర్నూల్ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు,మధు గౌడ్, మల్లేష్ ఉమ్మడి అనంతపూర్ జిల్లాల ఉద్యోగులు ఉమ్మడి కర్నూలు జిల్లా ఉద్యో గులు హాజరయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *