NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలిలో బదిలీ అయిన ఏఎస్సై, కానిస్టేబుల్‌కు ఘన సన్మానం

1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు:  ప్యాపిలి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీ అయిన ఏఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ ఎం. వెంకటరాముడికి శనివారం ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ప్యాపిలి ఎస్సై నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి వారిద్దరినీ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, అంకితభావం, ప్రజలకు అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.ఏఎస్సై వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లాకు, కానిస్టేబుల్ ఎం. వెంకటరాముడు ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయిన నేపథ్యంలో, నూతన విధి నిర్వహణ స్థానాల్లో కూడా ఇదే నిబద్ధతతో సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్సై నాగార్జున ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్యాపిలి పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని బదిలీ అయిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

About Author