NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ లోక్ అదాలత్ లో 62, 225 కేసులు పరిష్కారం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయలోక్ అదాలత్   రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తిజి. కబర్థి   ఆధ్వర్యంలో  శనివారం 11-07-2026 న జరిగిన  జాతీయ లోక్ అదాలత్ లో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలలో 62225 కేసులు పరిష్కారం అయ్యాయి. 200 మోటార్ ఆక్సిడెంట్ కేసులలో 15,11,43,507/- బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఇప్పించడం జరిగినది. శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన  96 మంది రైతుల వారసులకు Rs. 42,00,000/- రూపాయలు నష్టపరిహారంగా ఇప్పించడం జరిగింది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి    బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ  మొత్తం రెండు జిల్లాల్లో 31 బెంచీలను ఏర్పాటు చేసి 548 సివిల్ కేసులు,  61292 క్రిమినల్  కేసులు, బ్యాంకు కేసులు 289 పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో        సిబిఐ కోర్ట్ అదనపు జిల్లా జడ్జి శోభా రాణి , ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు,ఏడవ అదనపు జిల్లా జడ్జి లక్ష్మి రాజ్యం, శాశ్వత లోకాదల చైర్మన్ వెంకట హరినాథ్, కర్నూలు బార్ ప్రసిడెంట్  చంద్రుడు ,   రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మినరసింహారెడ్డి,  ప్రిన్సిపల్  సీనియర్ సివిల్ జడ్జి మల్లేశ్వరి  మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సంధ్యా రాణి, రెండో అదనపు  జూనియర్ సివిల్ సరోజనమ్మ, ఎక్సైజ్ కోర్టు జడ్జి  అనిల్ కుమార్, మొబైల్ కోర్టు జడ్జి అనూష, ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ,కోర్టుమా నిటరింగ్  సి ఐ. రామానాయుడు, న్యాయ వాదులు, బ్యాంక్ అధికారులు, బి యస్ యన్ యల్ అధికారులు, పంచాయతీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *