NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా..

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఎన్జీవో కార్యాలయం ఎదుటఏపీజెఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాలూకా కమిటీ ఉద్యోగులు శనివారం ధర్నా చేశారు.ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల కు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు అన్నారు.ఎన్జీవోస్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు ఏ.రాముడు జేఏసీ చైర్మన్ వైస్ చైర్మన్లు మూర్తుజావళి,యుటిఎఫ్ స్వామినాథన్,ఏపీటీఎఫ్ ఆంజనేయులు,డీటీఎఫ్ సెక్రెటరీ సత్యనారాయణ,సుధాకర్ యుటిఎఫ్ సంఘాలతో సమావేశం నిర్వహించారు.కార్మిక సంఘం నాయకులు, పిక్కిలి వెంకటేశ్వర్లు,కాటేపోగు సామన్న సంఘీభావం తెలిపారు.ఉద్యోగులకు చాలాకాలంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్టీసీ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసేలా స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.  కలవాలని నిర్ణయించారు.గత మూడేళ్లు గా పెండింగ్ లో ఉన్న సరెండర్ సెలవులను,వేతన సవరణ నాలుగు డిఏలు మంజూరు చేయాలని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు, పూర్తిస్థాయిలో సిపిఎస్ రద్దు,పది అంశాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్లు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *