NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సచివాలయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలని  ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా గురువారం ప్యాపిలి మండలంలోని బూర్గుల గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కోట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో అందిస్తున్న సేవలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల తీరును పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (S.I.R)కు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఎమ్మెల్యే  ఆదేశించారు.అదేవిధంగా సచివాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించాలని సిబ్బందికి సూచించారు.ప్రజా సేవల విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి దరఖాస్తును, ప్రతి సమస్యను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు బురుగుల గ్రామ తెదేపా నాయకులు, కార్యకర్తలు, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *