లీకేజీని తక్షణమే మరమ్మతు చేసి తాగునీటి వృథాను నివారించాలి: ఎమ్మెల్యే కోట్ల
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని బావిపల్లె క్రాస్ సమీపంలో తాగునీటి పైపులైన్ లీకేజీ కారణంగా నీటి వృథా జరుగుతున్న విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే , లీకేజీని తక్షణమే మరమ్మతు చేసి తాగునీటి వృథాను నివారించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.


