NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరేళ్ల చిన్నారి కి నూతన జీవితాన్ని ఇచ్చిన కిమ్స్ హాస్పిటల్స్

1 min read

– మూడు గంటల పాటు సూక్ష్మ శస్త్రచికిత్స

కర్నూలు, న్యూస్​ నేడు : ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గేటుపై పడటంతో కంటి రెప్పలు తీవ్రంగా చిట్లిపోవడంతో పాటు కన్నీటి నాళం (లోయర్ కెనాలిక్యులస్) తెగిపోయిన ఆరేళ్ల చిన్నారికి కిమ్స్ ఆసుపత్రి, కర్నూలు వైద్యులు అత్యంత క్లిష్టమైన సూక్ష్మ శస్త్రచికిత్స చేసి పూర్తిగా కోలుకునేలా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డా. నవ్య. కర్నూలు పట్టణానికి చెందిన దివిషా అనే ఆరేళ్ల చిన్నారి కంటిపైన గాయంతో తీసుకవచ్చారు. ఇక్కడ చేసిన పరీక్షల్లో కుడి కంటి ఎగువ, దిగువ రెప్పలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు కన్నీటి ప్రవాహానికి కీలకమైన లోయర్ కెనాలిక్యులస్ పూర్తిగా తెగిపోయినట్లు గుర్తించాం. చిన్నారుల్లో ఈ తరహా గాయాలు చాలా అరుదుగా కనిపిస్తాయని, వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే జీవితాంతం కంటినుంచి నీరు కారడం, రెప్ప ఆకృతి దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. చిన్నారుల్లో కన్నీటి నాళాలు చాలా సన్నగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న కణజాలం అత్యంత సున్నితంగా ఉంటుందని, అందువల్ల ఇటువంటి శస్త్రచికిత్సలు ఎంతో నైపుణ్యంతో నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.లూప్ మాగ్నిఫికేషన్, ప్రత్యేక మైక్రోసర్జికల్ పరికరాల సహాయంతో సుమారు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేశామన్నారు.ప్రారంభ దశలోనే ప్లాస్టిక్ మరియు రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్ ద్వారా చికిత్స అందిస్తే అద్భుతమైన ఫంక్షనల్, సౌందర్య ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.ఇలాంటి క్లిష్టమైన చిన్నారుల కంటి గాయాలకు సమయానుకూల వైద్యం, అత్యాధునిక మైక్రోసర్జికల్ నైపుణ్యం, సమగ్ర వైద్య సేవలతో శాశ్వత పరిష్కారం అందించడంలో కిమ్స్ ఆసుపత్రి కర్నూలు ముందంజలో ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *