NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ఆర్సీపీ 2.0 సూపర్ యాప్ ప్రారంభోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: వైఎస్ఆర్సీపీ 2.0 సూపర్ యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో పార్టీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త  ఎస్వీ మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చెల్లా విగ్నేశ్వర్ రెడ్డి  పాల్గొని 2.0 సూపర్ యాప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యకర్తలు విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని యాప్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో 2.0 సూపర్ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *