విద్యార్థులు “సేవా భావాన్ని” అలవర్చుకోవాలి!
1 min read
-ప్రధానోపాధ్యాయులు వన్నూరప్ప
న్యూస్ నేడు, పత్తికొండ: విద్యార్థులు తప్పనిసరిగా చిన్నప్పటి నుండే సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఎంపిపి ఆది ఆంధ్ర స్కూల్ ప్రధానోపాధ్యాయులు వన్నూరప్ప, యువ స్పందన సొసైటీ ఉపాధ్యక్షుడు లక్ష్మన్న సూచించారు. శుక్రవారం పత్తికొండ పట్టణంలోని ఎంపీపీ ఆది ఆంధ్ర స్కూల్ నందు చందోలి గ్రామానికి చెందిన రవి శేఖర్ రెడ్డి కుమార్తె బీటెక్ చదువుతున్న వైష్ణవి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతోపాటు సేవాభావాన్ని అలవర్చుకోవాలని, అందువల్ల సమాజానికి మంచి సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో బాగా చదువుకుని ఉన్నత స్థాయి చేరుకోవాలని ఆకాంక్షించారు ఆకాంక్షించారు. అనంతరం బీటెక్ విద్యార్థిని వైష్ణవి మాట్లాడుతూ… పత్తికొండ యువ స్పందన సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతుగా నోట్ బుక్స్, పెన్నులు విద్యార్థులకు అందజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, చందోలి రవిశేఖర్ రెడ్డి, బీటెక్ విద్యార్థిని వైష్ణవి, విద్యార్థులు పాల్గొన్నారు.


