NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షెడ్యూల్డు కులముల అభ్యర్దులకు ఇశ్రాయేలు దేశంలో నర్సింగ్ ఉద్యోగలకు అవకాశం

1 min read

జాతీయ శిక్షణా అభివృద్ధి సంస్థ వారి ద్వారా చర్యలు తీసుకుంటున్నాం

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ  ఎం. ముక్కంటి

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో GDA / ANM / GNM / B.Sc Nursing / Post B.Sc.Nursing పూర్తి చేసి నిరుద్యోగముతో వున్న షెడ్యూల్డు కులముల అభ్యర్దులకు ఇశ్రాయేలు దేశంలో నర్సింగ్ ఉద్యోగ అవకాశములు కల్పించుటకు జాతీయ శిక్షణా అభివృద్ధి సంస్థ వారి ద్వారా చర్యలుతీసుకుంటున్నామని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ  ఎం. ముక్కంటి ఒక ప్రకటనలో తెలిపారు.   ఇశ్రాయేలు దేశంలో హోం బేస్డ్ కేర్ గివర్ / నర్సింగ్ ఉద్యోగాలు (Home Based Care Giver / Nursing Jobs) గా పనిచేయుటకు ఆసక్తి కలిగి అభ్యర్ధులు 25 నుండి 45 సంవత్సరముల వయస్సు కలిగి ఉండాలని,        GDA / ANM / GNM / B.Sc Nursing / Post B.Sc.Nursing పూర్తి చేసి ఉండాలన్నారు.      అభ్యర్దులకు ఇంటర్మీడియట్ లెవెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ (CEFR B2 Level) తప్పనిసరి. కావున సదరు శిక్షణను (Training) ప్రభుత్వం వారే 60 నుండి 70 రోజులు ఉచితముగా అందిస్తామన్నారు.  ఇశ్రాయేలు దేశంలో పనిచేయుట ద్వారా సుమారుగా నెలకు రూ.1,99,770/-లు జీత భత్యములు పొందుటకు అవకాశం వున్నదన్నారు.     5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి అయిన వారు మరియు తగు ప్రామాణిక పరీక్షలు ఉత్తీర్ణత సాధించి, అవసరమగు ముందస్తు అనుభవం కలిగిన షెడ్యూల్డు కులముల నిరుద్యోగ యువతకు ఈ క్రింద తెలిపిన కోర్సులలో శిక్షణా కార్యక్రమాలు అందించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కిసాన్ డ్రోన్ ఆపరేటర్, 2 – డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, 3 – అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, 4 – సోలార్ పి వి ఇంస్టాలర్   (సుర్యామిత్రా), 5 – ఎలక్ట్రిక్ వెహికల్ మెయిన్టనెన్స్, 6 – బ్యూటీ తెరపిస్ట్, 7 – ప్లంబర్ – జనరలకోర్సులలో నైపుణ్య శిక్షణ కల్పించి వారికి ఉపాధి అవకాశములు కల్పిస్తున్నామన్నారు. పై కోర్సులలో శిక్షణ పొందుటకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తుతో పాటు వారి కుల ధృవీకరణ పత్రము,            విద్య అర్హత, ఆధార్ మరియు రైస్ కార్డు నకళ్ళను జతపరచి స్వయముగా గాని, లేదా ఆఫీస్ ఇ-మెయిల్ edscwg@yahoo.comకు మూడు (3) రోజుల లోపుగా సమర్పించాలన్నారు. పూర్తి వివరముల కొరకు యస్.సి.కార్పొరేషన్, ఏలూరు కార్యాలయమును నేరుగా గాని ఫోన్ ద్వారా కె సుగుణ రావు,ఏ ఇ ఓ – 97013 55337, మరియు  పి రామాంజనేయ ప్రసాద్, ఏఇఓ -97058 63666.  సంప్రదించవలసినదిగా తెలియజేసారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *