మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పై కేసు నమోదు
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు జి సూర్య వెంకటేశ్వర రెడ్డి నాన్న స్వామి రెడ్డి జేజి నాయన గాంతి నారాయణ రెడ్డి పేరుపైనున్న మిడుతూరు రోడ్డులో సర్వే నెం.827/B1 మరియు 827/B2లో మొత్తం ఎకరాలు 2-73 సెంట్ల భూమిలో ఫిర్యాది స్థలంలో జేసీబీతో శుభ్రం చేస్తుండగా ఫిర్యాది ఫోటోలు తీసుకొని తిరిగి వస్తుండగా అక్కడ ఉన్న దాసి సుధాకర్ రెడ్డి మరియు క్రిష్ణారెడ్డి ఇద్దరు కలిసి ఫిర్యాదు దారుని అడ్డగించి ఐఫోన్ సెల్ ఫోన్ లాక్కొని పక్కనే ఉన్న కృష్ణా రెడ్డి,బొట్టు రవి అను వారు కూడా ఫిర్యాదిని కాళ్లతో చేతులతో కొట్టినారని మళ్ళీ ఈ స్థలం జోలికి వస్తే నిన్ను చంపేస్తానని బెదిరించినాడని స్టేషన్లో సూర్య వెంకటేశ్వర రెడ్డి ఫిర్యాదు మేరకు దాసి సుధాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి,బొట్టు రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


