NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీటెట్ జూన్ –2026 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

1 min read

ఈ నెల 5 నుంచి 16 వరకు ఏపీ టెట్  పరీక్షలు

నాలుగు కేంద్రా లలో పరీక్షలకు హాజరు కానున్న 5,470 మంది అభ్యర్థులు

ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ

మదనపల్లె ఆగస్టు 3, న్యూస్ నేడు ప్రతినిధి : ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు అన్నమయ్య జిల్లాలో నిర్వ హించనున్న ఏపీటెట్ జూన్–2026 ఆన్‌లైన్ పరీక్షలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శ కంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో ఈనెల ఐదు నుంచి ప్రారంభం కానున్న ఏపీటెట్ జూన్–2026 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షల నిమిత్తం జిల్లాలో మొత్తం నాలుగు ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ తెలిపారు. వాటిలో మదనపల్లె లో రెండు, రాయచోటి లో రెండు కేంద్రాలు ఉన్నాయని, మొత్తం 5,470 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.పరీక్షా కేంద్రాల్లో అవసర మైన అన్ని సాంకేతిక సదు పాయాలు ముందు గానే సిద్ధం చేయాలని సూచించారు.ఆగస్టు 5 నుంచి 16 వరకు ఏపీటెట్ జూన్–2026 పరీక్షలు జరగ నున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని  ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నరసయ్య, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మేనేజర్,  సంబంధిత శాఖల జిల్లా అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, కళాశాలల ప్రతినిధులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *