ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ దృష్టి కి 62 ఫిర్యాదులు
1 min read
బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఆదేశం
మదనపల్లె ఆగస్టు 3, న్యూస్ నేడు ప్రతినిది : మదనపల్లెలో జిల్లా ఎస్పీ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో మొత్తం 62 ఫిర్యాదులు రాగ భూ వివాదాలు 19, ఆర్థిక లావాదేవీలు 7, కుటుంబ కలహాలు 12, చీటింగ్ 4, న్యూసెన్స్ 3, మరియు ఇతర సమస్యలు 17 ఉన్నాయి. భూ కబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకో వాలని పోలీసు అధి కారులను ఆదేశించారు.బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చ రించారు. ఈ ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తిచేసి, సంబంధిత నివేదిక లను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయా నికి పంపాలని ఎస్పీ స్పష్టం చేశారు.


