NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేతన్న సేవ కార్యక్రమం పై మాస్టర్ వీవర్స్ తో సమీక్షా

1 min read

అర్హులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణి

రెండు వార్డుల్లో ఇంటింటికి టిడిపి కార్యక్రమం

ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపల్లె ఆగస్టు 3,  న్యూస్ నేడు ప్రతినిది : ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పంపిణీ చేయనున్న నేతన్న సేవ కార్యక్రమం పై మదనపల్లె పట్టణం నీరుగట్టువారి పల్లి లో మాస్టర్ వీవర్స్ తో ఎమ్మెల్యే షాజహాన్ భాష సమీక్షా సమావేశం నిర్వ హించారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క నేతన్న కు పథకం అందేలా చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఈ కార్య క్రమంలో నాయకులు నీలకంఠ, కమలామరి కృష్ణ, మోడెంసిద్ధప్ప, యర్రబల్లి వెంకటరమణా రెడ్డి, కేవీ నాగరాజు, రమేష్ రెడ్డి, పవన్, శేఖర్ లు పాల్గొన్నారు.అదే విధంగా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 9,10 వార్డుల్లో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులను గురించి ఎమ్మెల్యే యం. షాజహాన్ బాషా వివరిస్తు ప్రభుత్వం ముద్రించిన   కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ నియోజక వర్గంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు సంతోషంగా స్వాగ తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రతి ఇంటికి చేర వేస్తు న్నామని, ఇదే ప్రభుత్వం మరింత కాలం కొన సాగాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని పేర్కొ న్నారు. అంతే కాకుండా మదనపల్లె మున్సిపాలిటీ  తొమ్మిదవ వార్డులో శారద అనే లబ్ధిదారు కి రూ. 3,31,257 మరియు మున్సిపల్ కార్యా లయంలో పెంచు పాడు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కు రూ. 47,884 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక కూటమి నాయకుల తో కలసి ఎమ్మెల్యే అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *