ఎన్టీఆర్ భరోసా కింద స్పెషల్ కేసుల కింద 25 కొత్త పింఛన్లు మంజూరు
1 min read
ఆగస్టు మాసంలో వీరికి పెన్షన్ మొత్తాల పంపిణీ
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద స్పెషల్ కేసులుగా సిఫార్సు చేసిన 25 మందికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు. వీరికి ఆగస్టు మాసంలో పింఛను మొత్తాన్ని కూడా పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు.ఈ ఏడాది జనవరి నుండి జూలై 10 వ తేదీ వరకు పిజిఆర్ఎస్ కు వచ్చిన అర్జీదారులు, ముఖ్యమంత్రి కార్యక్రమంలో వచ్చిన అర్జీ దారులు, ఇతరత్రా వచ్చిన అర్జీదారుల ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను పరిశీలించి, స్పెషల్ కేసులుగా పరిగణిస్తూ పెన్షన్ల మంజూరు కు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామని, ఆ ప్రతిపాదనలను పరిగణన లోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లను మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు.25 మంది లో 21 మందికి వికలాంగ పెన్షన్లు, ముగ్గురికి వితంతు పెన్షన్లు, ఒక్కరికి వృద్ధ్యాప్య పెన్షన్ మంజూరు అయినట్లు కలెక్టర్ వివరించారు.


