ఇంటింటికీ చేరిన టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సూచనలతో, డోన్ నియోజకవర్గ యువ నాయకులు కోట్ల రాఘవేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో, ప్యాపిలి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్యాపిలి మండలం కలచట్ల గ్రామపంచాయతీ పరిధిలోని కలచట్ల మరియు ఎస్. రాయంపేట గ్రామాల్లో మంగళవారం డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బత్తుల రమేష్ రెడ్డి తో పాటు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.



