NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాలుగు రోజుల్లో అసంక్రామిక వ్యాధుల సర్వే పూర్తి చేయాలి

1 min read

జిల్లా నోడల్ అధికారి అనిల్‌కుమార్ రెడ్డి

ప్యాపిలి న్యూస్ నేడు: రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం , ఎన్‌సీడీసీ జిల్లా నోడల్ అధికారి అనిల్‌కుమార్ రెడ్డి ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆశ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అసంక్రామిక వ్యాధుల సర్వే, స్క్రీనింగ్ పురోగతిని పరిశీలించిన ఆయన, సర్వేను నాణ్యతతో, ఖచ్చితత్వంతో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంపై శిక్షణ నిర్వహిస్తూ అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో అవుట్‌రీచ్ కార్యక్రమాలు చేపట్టి 4Dలు (పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకాహార లోపాలు, వ్యాధులు, అభివృద్ధి జాప్యాలు)తో పాటు హైపర్‌టెన్షన్, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, సెల్‌ఫోన్ వినియోగ ప్రభావాలు తదితరంగా మొత్తం 38 రకాల ఆరోగ్య పరిస్థితులపై స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు.స్క్రీనింగ్‌లో గుర్తించిన పిల్లలను, రోగులను జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కు రెఫర్ చేసి అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రాహుల్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర గౌడు, పర్యవేక్షకులు మనోహర్ రెడ్డి, సరోజ, శ్రీనివాస్, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు రోజా, ప్రసన్న, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *