NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాదవులపై దాడుల పట్ల ఆగ్రహం

1 min read

వెలుగోడు , న్యూస్​ నేడు:  రాష్ట్రము లో యాదవులపై దాడులు ఎక్కువ గా జరుగుతున్నాయని , యాదవులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని , నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని  అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు ఎస్. రఘు రాముడు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామ టిడిపి నేత నక్కలదొడ్డి శేఖర్ యాదవ్ పై దాడి చేయడం దుర్మార్గమని , దాడి చేసిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇటీవల రాష్ట్రము లో యాదవులపై దాడులు పెరుగుతున్నాయని , ఈదు ముడి లో గొర్రెల కాపరులపై దాడులు చేస్తే చర్యలు లేవు. గొర్రెల కాపరి ఈదయ్య యాదవ్ ను బైక్ తో కొట్టి చంపితే చర్యలు లేవు. సంగాల గ్రామం లో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇంటిలో అనుచరులతో శేఖర్ యాదవ్ పై దాడి చేస్తే చర్యలు లేవు. యాదవుల ఓట్ల కోసం నాయకులు తా పత్రయం తప్ప వారి రక్షణ కొరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఈ విదంగా దాడులు జరుగుతున్నందున బి. సి రక్షణ చట్టం వెంటనే అమలు లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *