పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలి
1 min read
ఇన్స్పైర్లో ఎక్కువ మంది పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించాలి
జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కే సుబ్రహ్మణ్యం
మదనపల్లె ఆగస్టు 5, న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజ మాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు బుధవారం అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె.సుబ్ర హ్మణ్యం సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణత చెందే విధంగా ఉపాధ్యా యులకుసూచనలు ఇవ్వాలని, సి, డి గ్రేడ్లు ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించాలని, అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అయ్యే విధంగా చూడాలని స్పష్టం చేశారు. సైన్స్ ఉపాధ్యాయు లు పిల్లలను ఇన్స్పైర్లో ఎక్కువ మందిని పాల్గొనే టట్లు, ప్రాజెక్టులు తయారు చేసేలా ప్రోత్సహించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హిస్తున్న మనం – వనం కార్యక్రమం గురించి ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు,ఉపాధ్యాయులు మొక్కలు నాటే మనం వనం కార్య క్రమంలో భాగ స్వామ్యం అవ్వా లన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడాలని, ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అటవీ శాఖ అధికారుల సమన్వయంతో మొక్కలు నాటే కార్య క్రమం చేయాలని తెలిపారు. వనం – మనం కు చెందిన పోస్టర్స్ ని డిఇఓ, ఇతర బృందం తో కలసి ఆవిష్క రించారు. ఈ కార్యక్రమంలో డిసిఇబి కార్యదర్శి గంగాధరం, జిల్లా సైన్సు అధికారి జి శ్రీధర్ కుమార్, రాయచోటి డైట్ ఇన్చార్జి లెక్చరర్ నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు రామ కృష్ణ, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు .


