వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
1 min read
ముచ్చుమర్రిలో ఉద్రిక్తత
పోలీస్ స్టేషన్ కు డాక్టర్ సుధీర్..నాయకులు
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పోలీసులకు మరియు వైసీపీ నాయకులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బుధవారం ఉదయం కేసీ కెనాల్ కు రైతులకు నీరు విడుదల చేయాలని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ మరియు నాయకులను ముచ్చుమర్రిలో రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఎస్సైలు నరేంద్ర,ఓబులేష్ సిబ్బంది అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి వుయ్ వాంట్ జస్టిస్ అంటూ వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.తర్వాత నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తర్వాత వదిలిపెట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించేందుకు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రారంభించారని దాదాపు 3800 నుండి 4800 వరకు నీళ్లు రాయలసీమ రైతులకు తాగు సాగునీరు ఉపయోగపడుతుందని శ్రీశైలంలో 860 క్యూ సెక్కుల నీళ్లు నిండి ఉన్నా 798 క్యూసెక్కులకే నీళ్లు విడుదల చేయాలని అనుమతి ఉన్నప్పటికీ ఎందుకు నీళ్లను విడుదల చేయడం లేదని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో పుల్యాల నాగిరెడ్డి,జడ్పిటిసి జగదీశ్వర్ రెడ్డి,వంగాల భరత్ కుమార్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి మరియు వివిధ మండలాల నాయకులు రైతులు పాల్గొన్నారు.



