NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉన్నత లక్ష్యాలతో ఫలితాలు సాధించాలి

1 min read

యువజన శాఖ జ్యోతిర్మయి విద్యార్థులకు అవగాహన..

మిడుతూరు (నందికొట్కూరు(న్యూస్ నేడు: విద్యార్థులు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుతూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కర్నూలు సెట్కూరు యువజన సంక్షేమ శాఖ అధికారిసి.జ్యోతిర్మయి అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మోడల్ పాఠశాలలో బుధవారం ఆ శాఖ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ కౌన్సిలింగ్,పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి సమయపాలన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా జ్యోతిర్మయి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే  క్రమశిక్షణ,అంకితభావం, పట్టుదల కలిగి ఉండాలని, మన దృఢమైన వైఖరి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తోడ్పడతాయని విద్యార్ధి దశలోనే చదువుతో పాటు వార్తా పత్రికలూ ఎంప్లాయిమెంట్ న్యూస్ మొదలగునవి చదవడం అలవాటు చేసుకోవాలని ఎటువంటి బలహీనతలకు లోను కాకుండా నైతిక విలువలు పాటిస్తూ పట్టుదలతో చదవాలని నేటి విద్యార్థులకు మొబైల్ వ్యసనం పెద్ద ప్రతిబంధకంగా మారుతుందని విద్యార్థులతో మానవహారం నిర్వహించారు.ప్రిన్సిపాల్ బిటి శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు తమ ఎదుగుదలకు విద్య ఎంతో అవసరమని విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణుత సాధించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో సెట్కూరు సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *