NCTE నిబంధనలను పాటించని B.ed కళాశాలపై చర్యలు తీసుకోవాలి
1 min read
యూనివర్సిటీ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన USFI,Bc,Sc,St, మైనార్టీ విద్యార్థి,యువజన, సమాఖ్య విద్యార్థి సంఘాలు
ఉపాధ్యాయు విద్యా ను వ్యాపారంగా మార్చిన యూనివర్సిటీ అధికారులు
RUSA నిధులపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ నందు B.ed కళాశాలల అప్లికేషన్ల అక్రమాలపై USFI,Bc, Sc St మైనార్టీ విద్యార్థి, యువజన సమాఖ్య నాయకులు ఉదయ్ కుమార్, శేఖర్ నాయుడు యూనివర్సిటీ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని బి. ఎడ్ కళాశాలలు NCTE ( national council for teaches education ) నియమ నిబంధనలు పాటించకుండా బాలాజీ బీఈడీ (పంచాలింగాల), శ్రీ సుధా బీఈడీ కళాశాల (డోన్), శారదా బీఈడీ కళాశాల (కర్నూలు) షిర్డీ బాబా బీఈడీ కళాశాల (నందికొట్కూరు), వెంకటరత్న బీఈడీ కళాశాల (కర్నూలు), శివసాయి కృష్ణ బీఈడీ కళాశాల (నందికొట్కూరు), భారతి బీఈడీ కళాశాల (నంద్యాల), ప్రతిభ బీఈడీ కళాశాల, శ్రీరంగ బీఈడీ కళాశాల (కొవెలకుంట్ల), సరస్వతి బీఈడీ కళాశాల (కరివేన ఆత్మకూరు), వరప్రసాద్ బీఈడీ కళాశాల (పంచలింగాల), నాయక్ బీఈడీ కళాశాల (దూపాడు, కర్నూలు) మరికొన్ని కళాశాలలకు సరైన భవనాలు కూడా లేవని అప్లికేషన్ సమయాల్లో మాత్రం నామవాత్రంగా ఏదో ఒక బిల్డింగ్ చూపించి యూనివర్సిటీ అధికారులను కాసులతో మైమరిపించి అనుమతులు పొందుతున్నారెమో కళాశాలకు కనీసం బిల్డింగ్, ల్యాబ్,అర్హత కలిగిన ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు లేకపోవడంతో పాటు, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్ లు, సైకాలజీ ల్యాబ్ లు, ఐసీటీ ల్యాబ్ లు, క్రీడా మైదానాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా అనేక కళాశాలల్లో లేవని తెలిపారుఇప్పటికే అడ్మిషన్స్ పూర్తయ్యాయి అని కళాశాలల యాజమాన్యం తెలపడం విడ్డురమని దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని అదే విధంగా RUSA ( రాష్ట్రీయ ఉచ్చిత్ శిక్షా అభియాన్) 2021 నందు ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి అధికారులు 10 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయగా జగన్నాధ గట్టుపై నిర్మాణ దశలోనే పునాది దశ పూర్తి కాకుండా గానే 90 లక్షలు కాంట్రాక్టర్లకు విడుదల చేసిన పరిస్థితి దాపరించింది ఈ నిధులు అటు అభివృద్ధికి కాక బూడిదలో పోసిన పన్నీరు ల అయిందని ఈ నిధులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు? తక్షణమే నిధులపై RUSA నిధులపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఉపాధ్యాయ విద్యను అభివృద్ధి చేయాల్సిన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల దూరవిద్య కేంద్రాలుగా మారాయని ఎన్ సి టి యు నిబంధనలను ఉల్లంఘించిన కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు ఈ అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో ప్రవీణ్, వీరేశ్, నవీన్ రెడ్డి, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.


