కోటి నిధులతో..పనులకు భూమి పూజ..పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే..
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: నందికొట్కూరు పట్టణ అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం ఉదయం కోటి రూపాయల నిధులతో పట్టణంలోని వివిధ కాలనీలో సిమెంట్ రోడ్డు పనులకు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. పట్టణంలోనినందికొట్కూరు షికారి కాలనీ,పగిడ్యాల రోడ్డు బీఆర్‌ఆర్ నగర్, రామాలయం వీధిలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూజలు చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో మూడు కోట్లతో సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనులు జరుగుతున్నాయని అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య మురుగు కాల్వల మరమ్మతుల కోసం 22 కోట్ల నిధులు మంజూరయ్యాయని వాటి పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని పట్టణంలో ఉన్న మురుగును తొలగించేందుకు 21 కోట్ల 75 లక్షలతో ప్లాంట్ నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామన్నారు. తర్వాత 20వ వార్డులో రెండేళ్ల పాలనలో భాగంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఏఈ దినేష్ కుమార్, మున్సిపాలిటీ అధికారులు, నాయకులు భాస్కర్ రెడ్డి, ఎస్ఎం డి జమీల్,ముర్తు జావలి,డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు.


