NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2026- 27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం

1 min read

ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా:వి.శ్రీనివాసరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026- 27 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం డిగ్రీ ప్రవేశాల కొరకు ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభమైనవని ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.బిఏ; బీకాం;బీఎస్సీ సింగిల్ మేజర్ ప్రోగ్రాంలో ప్రవేశాలు ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతున్నాయని తెలిపారు.ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల- జిల్లాలో హెల్ప్ లైన్ సెంటర్ గా వ్యవహరిస్తుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులు మరియు కళాశాలలు ఎదుర్కొనే సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, ఆన్లైన్ నమోదు,ధ్రువీకరణ తదితర అంశాలలో సహాయం అందించడం ఈ హెల్ప్ లైన్ సెంటర్ ప్రధాన బాధ్యతగా ఉంటుంది .  కావున ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, విద్యార్థులు అడ్మిషన్ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లయితే జిల్లా హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించి సేవలను వినియోగించుకోవాలని  కోరారు. సంప్రదించవలసిన అధికారులు  HLC కోఆర్డినేటర్: కే రమేశ్- 9247203460వెరిఫికేషన్ ఆఫీసర్-1: ఎం కృష్ణ చైతన్య-9490216357 వెరిఫికేషన్ ఆఫీసర్-2: డాక్టర్ పి ఆర్ కావ్య శ్రీ -9441376464ప్రిన్సిపల్:డా.వి శ్రీనివాసరావు : 9010042250. నెంబర్ల ద్వారా సేవలను వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *