సులువాయి గ్రామంలో తాగునీటి పైప్ లీకేజీకి తక్షణ పరిష్కారం
1 min read
– పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు వెంటనే స్పందన
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలం సులువాయి గ్రామంలో తాగునీటి కొళాయి పైప్ లీకేజీ కారణంగా గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు వెంటనే స్పందించి సమస్యను పరిశీలించారు.లీకేజీ ఏర్పడిన పాత పైపులను తొలగించి, కొత్త పైపులను ఏర్పాటు చేయించి మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయించారు. దీంతో తాగునీటి సరఫరా మళ్లీ యథావిధిగా ప్రారంభమై గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యను ఆలస్యం చేయకుండా పరిష్కరించిన పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు సేవలను గ్రామ ప్రజలు అభినందించారు. గ్రామంలో తాగునీటి వంటి మౌలిక సదుపాయాలపై ఇదే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించడం తమ బాధ్యత అని, తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వాటర్‌మ్యాన్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



