NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆరోగ్యశ్రీ పథకం సాధన దినోత్సవం

1 min read

గుండెజబ్బు చిన్నారుల కోసం 2004 లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో  పోరాటం

 నాటి పోరాట ఫలితమే నేడు కార్పొరేట్ హాస్పిటల్లో ఖరీదైన వైద్యం

ఏలూరు జిల్లా ఇంచార్జి కూచిపూడి సత్యం మాదిగ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆరోగ్యశ్రీ పథకం సాధన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యం ఆర్ పి ఎస్ ఏలూరు జిల్లా ఇంచార్జి కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల కోసం 2004 లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదికగా,నాటి పోరాట ఫలితమే నేడు కార్పొరేట్ హాస్పిటల్లో ఖరీదైన వైద్యం అందిస్తున్నారు. ఆయన పోరాటం చేయడం ద్వారా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడలేని విధంగా నిరుపేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యము ఉచితంగా అందే విధంగా ఆరోగ్య శ్రీ పథకం రావడానికి కారణమని తెలిపారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ.మాదిగ దండోరా పోరాట ఫలితం అని తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా ఈ సమాజంలో మానవీయ కోణంలో ఎన్నో పోరాటాలకు ఆధ్యుడు ఆరాధ్యుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వికలాంగులు  వృద్ధులు వితంతువుల పెన్షన్ పెంపు కోసం కూడా పోరాటం చేసిన ఘనత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మాదిగ దండోరా ఉద్యమాన్నిదని నాయకులు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో యం ఆర్ పి ఎస్ ఏలూరు జిల్లా కో-ఇంచార్జి కొత్తపల్లి మురళీ కృష్ణ మాదిగ, తనగల శేఖర్,యం యం ఎస్ మహిళా నాయకులు చవటపల్లి విజయ,సొంగ నక్షత్రం, నమ్మిన లక్ష్మి, కొలికిపాము హైమా, సోనాగాని స్వాతి ,మద్దాల తిరుపతి రావు, ముదగండ్ల ముతేశ్వరరావు, దుబ్బాక దేవరాజ్, కలపాల విలియమ్స్,చాట్ల సాయిబాబు ,కొలికిపాము యేసు, గన్ బజార్ యం ఆర్ పి ఎస్ యూత్ మేతర బాలాజీ, చలపాటి జాన్, మేతర నందు  తదితరులు ఫాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *