NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగాధం నుండి అభివృద్ధి దిశగా,సంక్షేమానికి రూ.1.49 లక్షల కోట్లు

1 min read

ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రానికి పునర్వైభవం

కూటమి పాలనపై ప్రజల్లో ఆదరణ

వైసీపీ విమర్శలకు ప్రజలే సమాధానం

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక, పరిపాలనా అగాధం నుంచి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.           ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూరెండేళ్ల కూటమి పాలనలో సంక్షేమానికి రూ.1.49 లక్షల కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన రుణాల రీ-షెడ్యూల్‌ ద్వారా రూ.8,269 కోట్లు ఆదా చేశామని, ఉద్యోగుల బకాయిలకు రూ.30,849 కోట్లు, పెండింగ్‌ బిల్లులకు రూ.19,357 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు విమర్శలు, పరామర్శల పేరుతో రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు.ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం, అభివృద్ధికే వినియోగిస్తూ బాధ్యతాయుత పాలన అందిస్తున్నామని చంటి అన్నారు. విధ్వంసక చర్యలను ఉపేక్షించబోమన్న సీఎం చంద్రబాబు హెచ్చరికను గుర్తుచేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *