NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో విజయవంతంగా జైలు బరో కార్యక్రమం 

1 min read

జైల్బరో కార్యక్రమం ద్వారా గుత్తి రోడ్డు సర్కిల్లో స్తంభించిన ట్రాఫిక్

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలి.                                             

సిఐటియు ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్ డిమాండ్ డిమాండ్

 నరేంద్ర మోడీ విధానాలను తిప్పి కొట్టాలని సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి పిలుపు

దేశ కార్మికుల భవిష్యత్తును అంధకారంలో నెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర స్పష్టం

న్యూస్ నేడు, పత్తికొండ:  సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్ఫూర్తితోసోమవారం పత్తికొండ లో చేపట్టిన జైలు బరో కార్యక్రమం విజయవంతమైంది. పత్తికొండ పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర నుండి ప్రారంభమైన కార్మిక సంఘాల ర్యాలీ, జైల్ బరో కార్యక్రమంలో భాగంగా గుత్తి సర్కిల్లో  రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎక్కడకక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జైల్ బరో కార్యక్రమాన్ని చేపట్టిన ఆందోళన కారుల పేర్లను నమోదు చేసుకున్నారు. కార్మిక సంఘాలు చేపట్టిన జైల్ బరో కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షులు గోపాల్ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా సిఐటియు ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే. ప్రభాకర్, సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి సిద్దయ్య గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బుజ్జులు, హాజరయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *