NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్లార్తిలో శ్రీ లక్ష్మీమమ్మ–శ్రీ కొలపురమ్మ ఆలయానికి ఘనంగా చేయూత

1 min read

రూ.50 వేల విరాళం అందించిన టీడీపీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్

ఆలయ నిర్మాణానికి అండగా నిలిచిన ఈబీజీ గోవింద్ గౌడ్, ఈబీజీ రాజేంద్ర గౌడ్

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న శ్రీ లక్ష్మీమమ్మ–శ్రీ కొలపురమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు సమిష్టిగా కృషి చేస్తున్నారు.విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఎల్లార్తి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. గ్రామ పెద్దల ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన ఈబీజీ గోవింద్ గౌడ్, ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ఠా కార్యక్రమానికి తనవంతు సహాయంగా రూ.50,000 ఆర్థిక విరాళాన్ని అందించారు.అదేవిధంగా టీడీపీ యువ నాయకులు ఈబీజీ రాజేంద్ర గౌడ్ కూడా ఆలయ నిర్మాణం, ప్రతిష్ఠా మహోత్సవానికి తనవంతు సహకారం అందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి నాయకులు అండగా నిలవడం పట్ల గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీమమ్మ–శ్రీ కొలపురమ్మ ఆలయానికి తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజలందరూ ఐక్యంగా పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. అమ్మవార్ల ఆశీస్సులతో ఎల్లార్తి గ్రామం సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ వంటి పవిత్ర కార్యక్రమాలకు సహకారం అందించడం ద్వారా గ్రామ ప్రజల ఆధ్యాత్మిక భావాలకు గౌరవం చాటుతున్నారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. రూ.50 వేల విరాళం అందించి ఆలయ నిర్మాణానికి చేయూతనిచ్చిన ఈబీజీ గోవింద్ గౌడ్‌కు, సహకారం అందించిన ఈబీజీ రాజేంద్ర గౌడ్‌కు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

26న వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ఈ నెల 26వ తేదీన శ్రీ లక్ష్మీమమ్మ–శ్రీ కొలపురమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ప్రతిష్ఠా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు హాజరై అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.గ్రామంలో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతున్న ఈ ప్రతిష్ఠా మహోత్సవానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు. అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతం కావాలని, ఎల్లార్తి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శేషి రెడ్డి, నాగరాజ్ గౌడ, ధనప్ప, సర్దార్, భంధాప, మలేషప్ప, నాగేషప్ప, మహదేవప్ప, పూజారి కుమార్, మహేష్, ఎల్లార్తి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *