డీఎస్సీ’ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వం
1 min read
ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలి
ర్యాలీలో పాల్గొన్న బుడ్డా శేషారెడ్డి..డాక్టర్ సుధీర్
నందికొట్కూరు న్యూస్ నేడు: డీఎస్సీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు బుడ్డా శేషారెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం చేపట్టిన డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని కోరుతూ పట్టణంలో నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో ర్యాలీ విజయవంతమైంది. ముందుగా వైసీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.తర్వాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. తర్వాత జరిగిన సభలో డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలు బయటికి రావాలని కేంద్రంలో నీట్ పరీక్ష లీక్ అయితే దానికి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని మరి ఇక్కడ డీఎస్సీలో అవకతవకలు జరిగితే ఎందుకు రాజీనామా చేయడం లేదని మండిపడ్డారు.డీఎస్సీలో ఉద్యోగం రాని వారు ఎంతో ఆవేదన చెందుతున్నారని విద్యార్థుల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు.తర్వాతరానున్న ఎన్నికల్లో పంచాయతీ,ఎంపిటిసి, జడ్పిటిసి మరియు మున్సిపాలిటీలో కౌన్సిలర్ తో పాటు చైర్మన్ కూడా వ్యక్తి ఉండాలంటే వైసీపీ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు సూచించారు.అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మత్తుల పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండలాల కన్వీనర్లు,నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.



