తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట
1 min read
102 తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించిన అసిస్టెంట్ కలెక్టర్ శ్రవణ్ కుమార్,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: తల్లులు,నవజాత శిశువులకు మరింత మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించే ఉద్దేశంలో భాగంగా ఏర్పాటు చేసిన 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాన్ని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ, తల్లి మరియు బిడ్డ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ , బాలింతలు, నవజాత శిశువులు వైద్య సేవల అనంతరం సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు 102 తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రవణ్ కుమార్,గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్యామలాదేవి, డిసి హెచ్ ఎస్ డాక్టర్:కమలా,జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శోభ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్:బేబీ కమల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.



