NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

32వ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ (ఎన్ సిఎస్ సి) 2026  పై అవగాహన

1 min read

రాష్ట్రపతి నుండి అవార్డు అందుకునే అవకాశం,

ఈనెల 15 లోగా రిజిస్ట్రేషన్ గడువుప్రతి ఒక్కరూ ప్రతిభ చూపించి పురస్కారం అందుకోవాలి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 32వ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ (ఎన్ సిఎస్ సి) 2026  పై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం డివిజన్ లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,జంగారెడ్డిగూడెం నందు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని గ్లోరీ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. “స్థిరత్వం (సుస్థిరత) కోసం సైన్స్ మరియు ఆవిష్కర” అనే ప్రధాన ఇథివృత్తంతో ఈ సంవత్సరం పోటీలు నిర్వహింపబడతాయన్నరు.

జిల్లా సమన్వయకర్త స్వర్ణ వెంకటేశ్వరరావు విద్యార్థులను

ఎన్ సిఎస్ సి పోర్టల్‌లో ప్రాజెక్టులు నమోదు చేసే విధానాన్ని, ప్రాజెక్టుకు ఏ అంశానికి ఎన్ని మార్కులు కేటాయిస్తారు అనే విషయాన్ని ఉపాధ్యాయులకు వివరించారు. రిసోర్స్ పర్సన్ గుర్రం గంగాధర్ రావు,ఎన్ సిఎస్ సి లో గల 5 సబ్‌థీమ్స్‌ పై అవగాహన కల్పించి,ప్రాజెక్ట్ చేసే విధానాన్ని ఒక నమూనా ప్రాజెక్టుతో వివరించి,ప్రాజెక్టు బృందాల ఏర్పాటు,ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన ముఖ్య అంశాలను ఉపాధ్యాయులకు తెలియపరిచారు. ఈనెల 15వ తేదీ లోపు అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత,ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను వెబ్సైట్ నందు అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. ప్రతి గ్రూపులో ఇద్దరు విద్యార్థులు,ఒక గైడ్ టీచర్ ఉండాలన్నరు. రాష్ట్రపతి నుండి అవార్డు అందుకునే అవకాశంలో ప్రతి ఒక్కరూ  ప్రతిభ చూపించి పురస్కారం అందుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డివిజన్ కు చెందిన 125 మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొని శిక్షణ పొందారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *