పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది
1 min read
మిడుతూరు’లో ఘనంగా ‘జ్ఞానజ్యోతి’శిక్షణ..
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: చిన్నారుల అభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నందికొట్కూరు సిడిపిఓ మంగవల్లి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ‘జ్ఞానజ్యోతి’పై శిక్షణ కార్యక్రమం సూపర్వైజర్ రేణుకా దేవి ఆధ్వర్యంలో జరిగింది.ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమం కార్యకర్తలకు 13 వ తేదీ వరకు’జ్ఞాన జ్యోతి’శిక్షణ మరియు ఈనెల 22,24,25 తేదీల్లో శిక్షణ ఉంటుందన్నారు.ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని కేంద్రాల్లో చిన్నారులకు నేర్పించాలన్నారు.తర్వాత డిఆర్పిలు శాంతి,గోకారమయ్య, దానమయ్య శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపిల్లల భవిష్యత్‌కు అంగన్‌వాడీలే బలమైన పునాది.పిల్లల విద్యా వికాసంలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని అంగన్‌వాడీ సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి,చిన్నారుల సమగ్ర అభివృద్ధికి మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.పిల్లల తొలి దశ విద్యాభ్యాసానికి అంగన్‌వాడీ కేంద్రాలు బలమైన పునాదిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.చిన్నారుల్లో విద్యా,మానసిక,శారీరక, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో అంగన్‌వాడీ పిల్లల వయసుకు అనుగుణంగా వారి అభ్యసన సామర్థ్యాలను గుర్తించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈవోలు ఫైజున్నిసా బేగం, మల్లికార్జున నాయక్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


