నూతన లైబ్రరీకి భవనం నిర్మించాలి
1 min read
సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని గ్రంథాలయానికి తక్షణమే నూతన భవనం నిర్మించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి. రఘురాం మూర్తి డిమాండ్ చేశారు.రఘురాం మూర్తి ఆధ్వర్యంలో మంగళవారం శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనం వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా రఘురాం మూర్తి మాట్లాడుతూగ్రంథాలయ స్థలం గత 28 ఏళ్లుగా ఆక్రమణకు గురైనప్పటికీ అధికారులు ఇప్పటివరకు స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యారనిసొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం గ్రంథాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది విద్యార్థులు నిరుద్యోగ యువత పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70లక్షల రూపాయల లైబ్రరీ సెస్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బకాయిలను వెంటనే విడుదల చేసి నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి వినియోగించాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే జయసూర్య,ఎంపీ శబరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రంథాలయ స్థలాన్ని ఆక్రమణ నుంచి విముక్తి చేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు.నూతన భవన నిర్మాణం చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పఠాన్ మౌలాలి,రాముడు, జగదీష్,రామకృష తదితరులు పాల్గొన్నారు.


