NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత ప్రణాళిక బద్ధంగా ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి

1 min read

– అసోసియేషన్ ఆఫ్ ఆలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

 కర్నూలు, న్యూస్​ నేడు: లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 117 ఎస్, ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలల  సంయుక్త ఆధ్వర్యంలో  అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని  యువతి యువకులకు  క్రిటికల్ థింకింగ్, పర్యావరణ పరిరక్షణ తదితర  సామాజిక సమస్యలపై  వ్యాసరచన పోటీలను నిర్వహించి  బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్, లయన్స్  జిల్లా చైర్ పర్సన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత దేశాభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తుందని, నేటి యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు, డిజిటల్ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు మరియు నాయకత్వ శిక్షణ అవసరమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా  ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వ  విశ్రాంత ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులు  లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఉపాధ్యక్షులు లయన్ మురారి శంకరప్ప మాట్లాడుతూ యువతలో సృజనాత్మకత, సేవా భావం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు వ్యాసరచన, క్విజ్, ప్రసంగం మరియు ఇతర పోటీలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఒకేషనల్ జూనియర్ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *