NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తుంగభద్ర దిగువ కాలువకు సాగు, తాగునీటిని వెంటనే విడుదల చేయాలి

1 min read

రైతుల సమస్యను మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి దృష్టికి తీసుకెళ్లిన తుంగభద్ర ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులు

కర్నూలు న్యూస్ నేడు: 2026 ఖరీఫ్ సీజన్‌లో తుంగభద్ర దిగువ కాలువకు సాగు, తాగునీటిని సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ తుంగభద్ర ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రతినిధులు రైతుల తరఫున రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరిలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని హాలహర్వి, హొళగుంద, ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు, కోసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, మంత్రాలయం, కోడుమూరు తదితర మండలాలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాలని ప్రతినిధులు మంత్రికి, కలెక్టర్‌కు వివరించారు. ఈ ప్రాంతాల్లో వేలాది కుటుంబాల జీవనోపాధి పంటల సాగుపైనే ఆధారపడి ఉందని, సాగునీరు అందకపోతే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

వర్షాభావంతో రైతులకు తీవ్ర నష్టం

ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట, వర్షాధార పొలాల్లో సాగు చేసిన పంటలు ఇప్పటికే దెబ్బతిన్నాయని, పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారని వారు వివరించారు. ఈ పరిస్థితుల్లో రైతుల ఆశలన్నీ తుంగభద్ర దిగువ కాలువ నీటిపైనే ఉన్నాయని తెలిపారు.గత ఖరీఫ్ సీజన్ అనంతరం దిగువ కాలువకు తగిన స్థాయిలో నీటి విడుదల లేకపోవడంతో రెండో పంట సాగు చేసే అవకాశం కూడా రైతులకు లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు కోసం రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని సాగునీటిని విడుదల చేయాలని కోరారు.

కనీసం 90 రోజుల పాటు నీటిని విడుదల చేయాలి

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తుంగభద్ర దిగువ కాలువకు కనీసం 90 రోజుల పాటు సాగు, తాగునీటిని విడుదల చేయాలని ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కాలువకు నీరు అందితే ఆరుతడి పంటలను సాగు చేసుకునే అవకాశం రైతులకు లభిస్తుందని, తద్వారా రైతుల కుటుంబాలకు కొంత ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు.కర్ణాటక ప్రాంతానికి సాగునీటి విడుదల జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కేటాయించిన సాగు, తాగునీటి వాటాను కూడా సమాంతరంగా విడుదల చేయాలని కోరారు. నీటి విడుదలలో జాప్యం జరిగితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని వివరించారు.

ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని వినతి

నీరు విడుదలైతేనే రైతుకు భరోసా

ఈ సందర్భంగా ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, “తుంగభద్ర జలాలే రైతుల ఆశాదీపం. కాలువకు నీరు విడుదలైతేనే పంటలు సాగవుతాయి. పంటలు పండితేనే రైతు కుటుంబాలకు జీవన భరోసా కలుగుతుంది.ఈ కార్యక్రమంలో తుంగభద్ర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పి. టిప్పు సుల్తాన్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు ఎన్. రమాకాంత్ రెడ్డి, ఎం.వి.ఎస్. ప్రసాద్, ఎన్. గోవర్ధన్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *