NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిసరాల పరిశుభ్రత ఆచరించడం వలన 70% వ్యాధులును అరికట్టవచ్చు

1 min read

అసిస్టెంట్ మలేరియా అధికారి జె.గోవిందరావు సూచించన

ఫిలాస్ పేటలో  ఫ్రైడే-డ్రై డే కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:ప్రజలు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత ఆచరించడం వలన 70% వ్యాధులును ముఖ్యంగా     జీర్ణకోశ  సంబంధిత వ్యాధులు, కీటకాలుకుట్టడం ముఖ్యంగా దోమ కుట్టడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టుకోవచ్చని  అసిస్టెంట్ మలేరియా అధికారి జె.గోవిందరావు సూచించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏలూరు ఫిలాస్ పేట  ఫ్రైడే డ్రై డే కార్యక్రమం పట్ల అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత లోపించుటవలన   జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు ముఖ్యంగా వాంతులు విరోచనాలు టైఫాయిడ్, కామెర్లు, నులి పురుగు వ్యాధి, మరియు ఇతర వ్యాధులు సంక్రమిస్తాయని పరిసరాల పరిశుభ్రత లోపించడం వలన  దోమలు వృద్ధి చెంది తద్వారా డెంగు మలేరియా చికెన్ గునియా తదితర వ్యాధులు సంభవించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి లేక రెండుసార్లు నీటి నిల్వ ప్రాంతాలు అయిన తొట్లు,డ్రమ్ములు కడిగి మూతలు పెట్టుకోవాలని, రుబ్బురోల్లును ఫ్లవర్ వాజ్లోనూ పూల కుండీల్లోనూ నీరు నిలవ లేకుండా చూసుకోవాలని దోమకాటు చాలా ప్రమాదకరమని దోమ కాటు నుండి రక్షించుకోవాలంటే ఫుల్ హ్యాండ్ డ్రెస్సెస్ వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక మలేరియా హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు,గోపాల కృష్ణ  ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *