NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అటవీ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతుల వెదజల్లే కార్యక్రమం

1 min read

జిల్లా అటవీశాఖ అధికారిపీ.వి.సందీప్ రెడ్డి

జిల్లాలోని వెంకటాద్రిగూడెం (విఎస్ఎస్)కొండ ప్రాంతంలో

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతుల వెదజల్లే కార్యక్రమం ఏలూరు జిల్లా వెంకటాద్రి పురం విఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మరియు అటవీ ప్రాంతాల విస్తరణే లక్ష్యంగా “విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమం” ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారి (డిఎఫ్ఓ) పీ.వి. సందీప్ రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్. మార్గదర్శకత్వంలో మరియు ఏలూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ ఓ) ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లాలోని వెంకటాద్రిగూడెం (విఎస్ ఎస్)కొండ ప్రాంతంలో  డ్రోన్ సాయంతో విత్తన బంతులను (సీడ్ బాల్స్) వెదజల్లడం జరిగింది.మనుషులు వెళ్లడానికి వీలులేని మరియు చేరుకోలేని గుట్టలు, కొండ ప్రాంతాలలో అడవులను పెంచేందుకు అధునాతన డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.కార్యక్రమ ముఖ్యాంశాలు

సాంకేతికత వినియోగం : అటవీ శ్రేయస్సు కోసం డ్రోన్ సహాయంతో వేలాది విత్తన బంతులను (సీడ్ బాల్స్) కొండప్రాంతాలలో సమానంగా వెదజల్లారు. భవిష్యత్తు తరాలకు పచ్చదనం వాతావరణ సమతుల్యతను కాపాడుతూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి మరియు ఆకుపచ్చని పర్యావరణాన్ని అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు.సిబ్బంది భాగస్వామ్యంఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, వి ఎస్ ఎస్ (వన సంరక్షణ సమితి) సభ్యులు మరియు డ్రోన్ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.అటవీ శ్రేయస్సు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *