NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి ఒక్కరూ కనీస రెండు మొక్కలను నాటి, సంరక్షించే బాధ్యత తీసుకోవాలి

1 min read

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టరుతో ఎమ్మెల్యే చింతమనేని,జాయింటు కలెక్టర్ యంజె.అభిషేక్ గౌడ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:దెందులూరు మండలం దెందులూరు యస్ యంఆర్ నగర్లో అన్నాక్యాంటీన్ వద్ద శుక్రవారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మొక్కలను నాటారు. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ కనీస రెండు మొక్కలను నాటి, సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటే కార్యక్రమం ఒక మంచి అలవాటుగా చేసుకోవాలని అన్నారు.నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అవి చెట్లుగా ఎదిగేలా అధికారులు, సిబ్బంది మరియు గ్రామస్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఈవో పి.జగదాంబ,ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, జిల్లా పంచాయతీ అధికారి జి.వి.కె. మల్లిఖార్జునరావు,డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, తహశీల్దారు బి.సుమతి,డిప్యూటీ యంపిడివో యం.భీమరాజు, వివిధ శాఖలు అధికారులు, ఏయంసి చైర్మన్ గారపాటి రామసీత, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *