NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘనంగా జాతీయ జెండా ర్యాలీ

1 min read

జాతీయ జెండాతో ప్రతి యువకుడు ర్యాలీలో పాల్గొనాలి

హోళగుంద న్యూస్ నేడు : దేశానికి స్వాతంత్ర్యం లభించి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు హొళగుందలో జాతీయ జెండా ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా నిర్వహించనున్న ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఆగస్టు 15వ తేదీ ఉదయం 8:30 గంటలకు హొళగుంద బస్టాండ్ సర్కిల్ నుంచి జాతీయ జెండా ర్యాలీ ప్రారంభమై, ప్రధాన వీధుల మీదుగా కొనసాగి వాల్మీకి సర్కిల్ వరకు నిర్వహించనున్నారు. ర్యాలీలో ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను చేతబట్టి దేశభక్తిని చాటాలని కోరారు.భారతదేశం మనందరి దేశమని, ఒకే జెండా కింద ఒకే దేశంగా ఐక్యంగా నిలవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.యువత దేశ భవిష్యత్తుకు దిక్సూచి అని, దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. జాతీయ జెండాకు గౌరవం ఇస్తూ ర్యాలీని క్రమశిక్షణతో నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.“ఒకే జెండా – ఒకే దేశం – ఒకే గర్వం” అనే స్ఫూర్తితో నిర్వహించనున్న ఈ జాతీయ జెండా ర్యాలీలో హొళగుంద ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *