ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
1 min read
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు పార్లమెంటు ప్రజలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహా నేతల వరకూ ఎంతో మంది అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ దేశ పురోగతికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత 79 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తూ నేడు ప్రపంచంలోనే అగ్ర దేశాల్లో ఒకటిగా నిలవటం భారతీయులందరికీ గర్వకారణం అన్నారు. అదే సమయంలో కుల, మత, వర్గాల పేరుతో సమాజంలో అశాంతిని రేపేందుకు ప్రయత్నించే తిరోగమన శక్తులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో దేశ సమగ్రత, భద్రత, ప్రగతికి సమైక్యంగా కృషి చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ది పథంలో తీసుకెళదామని ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.


