విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
1 min read
హోళగుంద న్యూస్ నేడు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హొళగుంద మండల విద్యాశాఖ కార్యాలయం (ఎంఆర్‌సీ)లో శనివారం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారులు–1, మండల విద్యాధికారులు–2, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీఆర్‌ఎంటీలు, డీటీపీ ఆపరేటర్, మెసెంజర్ తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం దేశభక్తి, జాతీయ సమైక్యత, విద్యా అభివృద్ధి పట్ల తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.కార్యక్రమం దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.


