NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మదరసా ఆయేషా సిద్దిఖాలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు – ఈబీజీ గోవింద్ గౌడ్

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని మదరసా ఆయేషా సిద్దిఖా, ఆయేషా సిద్దిఖా ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్, టీడీపీ కో-కన్వీనర్ జాకీర్, టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షులు ముల్లా మోయిన్, మండల మైనార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముఖ్య అతిథులకు పాఠశాల విద్యార్థులు రోజ్ పుష్పాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఈబీజీ గోవింద్ గౌడ్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మైనార్టీ పెద్దలు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, “విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. క్రమశిక్షణ, పట్టుదల, దేశభక్తిని అలవర్చుకుని మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి. విద్యార్థులు సాధించే విజయాలే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది” అని అన్నారు.స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి స్ఫూర్తితో విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  విద్యార్థులు విద్యలో రాణించి బాధ్యతగల మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.టీడీపీ మండల మైనార్టీ అధ్యక్షులు ముల్లా మోయిన్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చదువుతో పాటు దేశభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణను అలవర్చుకుని దేశానికి సేవ చేయాలని సూచించారు.కార్యక్రమంలో మదరసా ఆయేషా సిద్దిఖా హెడ్‌మాస్టర్ మౌలానా అబూబకర్, మౌలానా షాకీర్, మౌలానా సుభాన్, పాఠశాల ఉపాధ్యాయులు, మైనార్టీ మత పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదివి మంచి పౌరుడిగా ఎదిగి దేశ అభివృద్ధికి తన వంతు సేవ చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *