మంత్రి నుండి అవార్డు అందుకున్న ఎంపీడీవో
1 min read
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: 80 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మిడుతూరు ఎంపీడీవో పి దశరధ రామయ్య ఉత్తమ అవార్డు అందుకున్నారు.నంద్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శనివారం జరిగిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి,ఎస్పీ సునీల్ షెరాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఉత్తమ అధికారులుగా పనిచేసిన వారికి మంత్రి కలెక్టరు ఎస్పీ అవార్డులు అందజేశారు వీరిలో మిడుతూరు ఎంపీడీవో పి దశరధరామయ్య మరియు మిడుతూరు స్వర్ణ గ్రామ మండల అధికారి సురేష్ కుమార్ లకు మంత్రి అవార్డును అందజేస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.



