త్యాగధనుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యం
1 min read
స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:త్యాగధనుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్ర స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచేందుకు ప్రతిఒక్కరి సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఏలూరులోని జిల్లా సర్వజనాసుపత్రిలో శనివారం భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం జాతీపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే విద్యార్ధినులు దేశభక్తి గీతాలాపన చేశారు.కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల, డిసిహెచ్ఎస్ డాక్టర్ బేబి కమల, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ దీనా, శానిటేషన్ పిఆర్వో దత్తు, మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


