విద్యా,రాజకీయ రంగాలలో డాక్టర్ సేతు సేవలు స్ఫూర్తిదాయకం
1 min read
ఘనంగా సన్మానించిన ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు
మదనపల్లె ఆగస్టు 17, న్యూస్ నేడు ప్రతినిధి : విద్యా, రాజకీయ రంగాలలో డాక్టర్ ఎన్.సేతు సేవలు స్ఫూర్తిదాయకమని ఏపీయూడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు. బీజేపి రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యుడిగా నియమితులైన శుభ సందర్భాన్ని పురస్క రించుకొని సోమవారం విజయభారతి పాఠశాల ఆవరణలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి తోకలిసి దుశ్యాలువ, తలపాగ,గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యా రంగంలో సుదీర్ఘ సేవలు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.విజయభారతి విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ పాత్రికేయుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం కాకుండా పాత్రికేయుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తున్నారని కొని యాడారు.భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఆయన విశేష సేవలు అందిస్తున్నారని,ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం రాష్ట్ర కమిటీలో చోటు కల్పించిండం శివ పరిణామమన్నారు.అందరినీ చిరునవ్వుతో పలక రిస్తూ రాజకీయాలలో అజాతశత్రువుగా ప్రసిద్ధిగాంచారని ప్రశంసించారు.భవిష్యత్తు రాజకీయాలలో బిజెపిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించాలని,మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు టివి5 రమేష్ రాయల్, ఏపీబిజేఎ జిల్లా అధ్యక్షులు ఎన్టీవీ ప్రసాద్,పాత్రికేయులు నరసింహులు, మధుసూదన్,శ్రీనివాసులు రెడ్డి, సురేంద్ర,మైసూర్ శ్రీనివాసులు, ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, విజయ్, రెడ్డి శేఖర్ నాయుడు, కురబల కోట శ్రీనివాసులు, వట్టికొండ రెడ్డి శేఖర్, గోపాల్, విజయ్ కుమార్, మైసూర్ శ్రీనివాసులు యాదవ్, హరి ప్రసాద్, నవీన్ వెంకటేష్ లు పాల్గొన్నారు.


