పత్తికొండలో విస్తృతంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ పట్టణంలో మంగళవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. పట్టణంలో 7, 8, 17 వార్డులలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా సాగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్నాథ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు, శంకర్, పల్లె పవన్ కుమార్ ల నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాల గురించి స్థానిక ప్రజలకు నాయకులు వివరంగా తెలియజేశారు. ప్రతి ఇల్లూ తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలు, ఇతర అర్జీలపై స్పందిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, ప్రాంతీయ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. వార్డు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను సేకరించడం ద్వారా పాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


