NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

1 min read

పేదల పెన్నిధి.. జన హృదయ నేత వైఎస్సార్

హోళగుంద మండలంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమం

వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన బూసినే వెంకటేష్

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా – ఆలూరు నియోజకవర్గం – హోళగుంద మండలం, మహానేత, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా హోళగుంద మండలంలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆలూరు శాసనసభ్యులు బూసినే విరూపాక్షి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి సోదరుడు బూసినే వెంకటేష్ పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన ప్రజాసేవలను, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్

ఈ సందర్భంగా బూసినే వెంకటేష్ మాట్లాడుతూ, పేదల పెన్నిధిగా, జన హృదయ నేతగా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.

“పేదల పెన్నిధి, జన హృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడికి శతకోటి ఘన నివాళులు. జోహార్ రాజన్న!” అని పేర్కొన్నారు.

మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు వైఎస్సార్

మాట తప్పని.. మడమ తిప్పని నైజంతో తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేసుకున్నారని బూసినే వెంకటేష్ అన్నారు.

“డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. కోట్లాది మంది పేద ప్రజల ఆశలకు ప్రతిరూపంగా నిలిచిన ప్రజానాయకుడు. ఆయన చేసిన ప్రజాసేవను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. ఆయన ఆశయాలను స్మరించుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి” అని అన్నారు.

వైఎస్సార్ చూపిన ప్రజా సంక్షేమ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, పేదలు మరియు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారీగా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా ఉపాధ్యక్షుడు, ఎంపీటీసీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *